TG: హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరించడంపై బీజేపీ నేత రాంచందర్ రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చని, పవన్ సభ పేరు చెబితేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైందని విమర్శించారు. ఆ రెండు పార్టీలు తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు చూస్తున్నాయని, పవన్ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు.