KMR: జిల్లాలోని తాడ్వాయి మండలంతో పాటు ఆయా మండల గ్రామాల ప్రజలకు కొత్త పింఛన్ల మంజూరు వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది. నూతన పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకునేందుకు, తమ అప్లికేషన్ల స్థితిని తెలుసుకునేందుకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, కాగితాల ఫైళ్లతో ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.