NRML: నర్సాపూర్ (జీ) మండలంలోని గొల్లమాడ గ్రామ పల్లె ప్రకృతి వనం నిర్వహణ లోపంతో అస్తవ్యస్తంగా మారింది. రాత్రి వేళల్లో కొందరు ఇక్కడ మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీంతో పార్కులో మద్యం సీసాలు, చెత్తాచెదారం పేరుకుపోయి, కూర్చునే బల్లలు విరిగిపోయి కనిపిస్తున్నాయి. అధికారులు స్పందించి పార్కుపై నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.