KNR: జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక- 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 4, 6, 8, 10 తేదీల్లో జరగనున్న గ్రామసభలు, వార్డు సభలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం రాత్రి జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్రామసభల నిర్వహణ, వనమహోత్సవం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల విజయవంతంపై చర్చించారు.