PPM: ఏపిఈపిడిసీల్ పార్వతీపురం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పెద్దింటి త్రినాధరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు విజయనగరంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై మన్యం జిల్లాకు బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన ఆనంతరం జిల్లా కలెక్టర్ డా, ప్రభాకరరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి, పూలమొక్కను అందజేశారు.