NLR: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాత్రి 8 గంటలకు అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.