NTR: రెడ్డిగూడెం, రంగాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం క్వింటాల్‌కు రూ.2,369 చొప్పున ధాన్యం కొనుగోలు జరుగుతుందని అధికారులు తెలిపారు. రైతులకు మంచి ధర లభించేలా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని, నేరుగా చెల్లింపులు జరగడం వల్ల పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.