KMR: బిక్కనూర్ ఏఐసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా ఇంఛార్జ్‌గా పట్టణ సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్‌ను జాతీయ చైర్ పర్సన్ డాక్టర్ సునీల్ పన్వార్ గురువారం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.