SS: మడకశిర నియోజకవర్గం మందలపల్లిలో విజయ్ భాస్కర్ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. అగ్రకులస్తులు పక్కా పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడ్డారని దళిత సంఘాల నేతలు ఆరోపించారు. వైద్యులు, పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని కలెక్టర్, ఎస్పీ పరామర్శించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.