VKB: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో జిల్లాలో రవాణా వ్యవస్థ స్తంభించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు విధులను బహిష్కరించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వికారాబాద్, తాండూర్, పరిగి, మోమిన్‌పేట బస్టాండ్లు ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. బస్సులు రాకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి చూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.