CTR: వీకోట మండలం జంగం గురువే పల్లె గ్రామంలో కురబ దేవర్లు బుధవారం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవర్లకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న జెడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులకు నిర్వాహకులు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఆయనను సన్మానించారు.