MDCL: ఉప్పల్, హబ్సిగూడ, నాచారం ప్రాంతాల్లో టమాటా ధరలు రోజురోజుకీ పెరుగుతూ వినియోగదారులకు భారం అవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా కిలో ధర రూ.45 వరకు చేరడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశముంది.