PPM: గరుగుబిల్లి మండలం తోటపల్లి పరిసర పొలాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, పొలాలకు ఒంటరిగా వెళ్లకూడదని కోరారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని, వెంటనే అధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు.