NZB: రాష్ట్ర రైతులు స్థిరమైన పురోగతి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తెలిపారు. శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కార్యాలయంలో కమిషన్ సభ్యుల సమావేశం జరిగిందన్నారు. వానాకాలం పంటల ప్రణాళిక, మే 4 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే రైతు వారోత్సవాల నిర్వహణపై సమగ్రంగా చర్చించినట్లు చెప్పారు.