SRD: జిల్లాలోని జిమ్ సెంటర్లలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ జనజాగరణ సమితి ప్రతినిధులు జిల్లా ఎస్పీ పంకజ్ పరితోష్కు వినతిపత్రం అందించారు. జిమ్లలో మహిళలపై వేధింపులు అరికట్టేందుకు సీసీ కెమెరాల నిఘా పెంచాలని, తప్పనిసరిగా మహిళా ట్రైనర్లను నియమించేలా చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు. మహిళలు నిర్భయంగా వ్యాయామం చేసుకునే వాతావరణం కల్పించాలన్నారు.