TG: సచివాలయంలో మంత్రుల బృందం, RTC JAC నేతల మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. కార్మికులు కోరుతున్న 29 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అయితే, మరో 3 కీలక డిమాండ్లపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ప్రధాన అంశాలపై మంత్రులు, JAC ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. వీటిపై ఏకాభిప్రాయం కుదిరితే ఆర్టీసీ సమ్మెకు త్వరలోనే ముగింపు పడే అవకాశం ఉంది.