TG: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. ఇక రాష్ట్రంలోనే అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. భానుడి ప్రతాపంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.