NLG: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం, కార్మికులు పట్టుదలకు పోకుండా ప్రజల పక్షాన ఆలోచించాలని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్నారు.