KRNL: పత్తికొండ, దేవనకొండ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా సరఫరా నిలిచిపోవడంతో పలు హెచ్పీ, ఐఓసీ పెట్రోల్ బంకులు ఇవాళ మూతపడ్డాయి. ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, కర్నూలు ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సరఫరా లోపాన్ని ముందుగా గుర్తించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి.