WGL: నగరంలోని కట్ట మల్లన్న గుడి సమీపంలో శుక్రవారం గ్యాస్ పైపులైన్లో లీకేజీ చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికులు భయాందోళనకు గురవగా, పరిసర ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు.