సత్యసాయి: ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్, డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో పెట్రోలింగ్ పెంచడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.