MDCL: కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడారు. ప్రాజెక్టు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సబిత అనిల్ కిషోర్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.