WGL: ప్రతి కుటుంబం ఆర్థికపరంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఏలుకుర్తిలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు నూతన వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడినిచ్చే పంటలను సాగు చేయాలని, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే అన్నారు.