AP: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో డీజిల్ కొరతతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కోతకు వచ్చిన సమయంలో డీజిల్ అందుబాటులో లేకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వరికోత యంత్రాలకు డీజిల్ లేక.. అధిక ధరలకు యంత్రాలను మాట్లాడుకొని ఆర్థికంగా నష్టపోతున్నామంటూ వాపోతున్నారు. ధాన్యం అమ్మే సమయంలో వరికోత కోయలేక రైతులు లబోదిబోమంటున్నారు.