WNP: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ భవనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ గ్రామపంచాయతీ భవనం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.