NZB: బాల్కొండ మండలానికి చెందిన 108 అంబులెన్స్‌ను గురువారం మధ్యాహ్నం ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్ప్ సర్వీస్ ఆడిట్ అధికారి వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా వాహనంలోని మందులు, రికార్డులు, పరికరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండల ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, కాలం చెల్లిన మందులను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.