HNK: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. హనుమకొండ హంటర్ రోడ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మేడిగడ్డ బ్యారేజీలో స్వల్పంగా దెబ్బతిన్న రెండు పిల్లర్లను రిపేర్ చేసి రాష్ట్రంలోని లక్షలాదిమంది రైతుల త్రాగు, సాగునీటి కష్టాలు తీర్చాలని కోరారు.