సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ తోడేటి రమేష్ ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు నేరుగా కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. రైతులు నాణ్యమైన, ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకువచ్చి సరైన గిట్టుబాటు ధర పొందాలని కోరారు.