ATP: ఈ నెల 25న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కంటి పరీక్షలు చేయించుకుని, శస్త్రచికిత్స అవసరమైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఈ సదుపాయం కల్పిస్తామన్నారు.