KMR: జిల్లాకు చెందిన కుమ్మరి నరేష్ అరుదైన గౌరవం పొందారు. ఈనెల 24 నుండి 28 వరకు మహబూబాబాద్ జిల్లా NTR స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి సేపక్ తక్రా పోటీలకు ఆయన న్యాయ నిర్ణేతగా ఎంపికయ్యారు. ప్రెసిడెన్షియల్ ప్రైమ్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నరేష్ ఈ పోటీలకు ఎంపికైనట్లు రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు.