E.G: రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో విచ్చేసిన ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.