KKD: బిక్కవోలు ఆలయాలలో అరుదైన లకులీశరూపంలోని శివుయ్య కొలువై ఉంటారు. పాశుపత శైవానికి చెందిన ఈ శైలి దక్షిణ భారతంలో చాలా అరుదు. నాటి కళింగ ప్రాంతంతో ఉన్న సాంస్కృతిక సంబంధాల వల్ల ఇక్కడ ఒడిశా శిల్ప రీతులు, మకర తోరణాల అలంకరణలు స్పష్టంగా కనిపిస్తాయి. తూర్పు చాళుక్యులు, తూర్పు గంగుల మధ్య ఉన్న సత్సంబంధాలకు ఈ అద్భుత శిల్పకళా సంపద సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.