TG: భద్రాద్రి కొత్తగూడెంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నాకు MLA కూనంనేని సాంబశివరావు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ విజయంలో ఆర్టీసీ కార్మికుల కృషి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమని చెప్పారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె విచ్ఛిన్నానికి యత్నిస్తే ప్రభుత్వానికే మచ్చ అని పేర్కొన్నారు.