‘రామాయణ’ సినిమాలో రావణుడిగా నటించడంపై హారో యష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో భారతీయ నటీనటులందరూ భాగస్వాములు కావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నాడు. వ్యక్తిగతంగా తనకు నెగటివ్ షేడ్స్, డార్క్ రోల్స్, సంక్లిష్టమైన పాత్రలంటే ఇష్టమని, అందుకే ఈ పాత్రను ఎంచుకున్నట్లు వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.