కోనసీమ: వాడపల్లి వెంకన్న ఆలయంలో నిర్మాణంలో ఉన్న వకుళామాత అన్నదాన భవనం పనులను ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు స్వయంగా శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ స్థలాన్ని సందర్శించిన ఆయన పనుల పురోగతిని సమీక్షించి సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు. నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన చైర్మన్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు