SKLM: టెక్కలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనాభా లెక్కల ఆవశ్యకతపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి ప్రధానోపాధ్యాయులు పి.హరిప్రసన్న మెడల్స్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జనాభా లెక్కలు దేశ సమగ్రాభివృద్ధికి బలమైన పునాది రాయి వంటిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.