KDP: ముద్దనూరులో ఎరువులు, పురుగు మందుల దుకాణాలను AO మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీలర్లు డీబీటీ విధానంలోనే అమ్మకాలు చేయాలని, ప్రతి రైతుకు నగదు బిల్లు ఇవ్వాలన్నారు. స్టాక్ రిజిస్టరు, ధరల పట్టీలను ప్రతిరోజూ అప్డేట్ చేయాలని కోరారు. వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన వాటినే విక్రయించాలని ఆయన స్పష్టం చేశారు.