కడప పోలీస్ కార్యాలయంలో గురువారం మహర్షి భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ భగీరథుడికి నివాళులర్పించి, ఆయన జీవితాన్ని దృఢ సంకల్పం, అచంచల భక్తి, త్యాగాల సమ్మేళనంగా కొనియాడారు. కఠోర తపస్సుతో గంగను భూమికి తెచ్చిన భగీరథుడి పట్టుదల ఆదర్శప్రాయమని, ఆయన స్ఫూర్తితో సమాజ శ్రేయస్సు కోసం నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.