AP: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న దేవాదాయశాఖ అధికారి కె.శాంతిని ఏసీబీ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఈ మేరకు ఏసీబీ న్యాయస్థానం ఆమెను రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఏసీబీ అధికారులు ఆమెను తమ కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టేందుకు కోర్టు అనుమతించింది.