KMR: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ,గృహ గణనను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా స్థాయి అధికారులతో గృహ గణనపై, ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గృహ గణనలో పాల్గొనే అధికారులకు ముందస్తుగా, శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.