BDK: ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకులాల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 53కోట్లు మంజూరు చేసిందని ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. గురువారం మణుగూరు మండలం లంకమల్లారం ఆర్జేసీ బాలికల గురుకుల కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం ఐటీడీఏకు రూ. 6 కోట్లు కేటాయించగా, అందులో లంకమల్లారం గురుకులానికి రూ. 25 లక్షలు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు.