GNTR: పెదనందిపాడు మండలంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ హేనప్రియకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ అధ్యక్షురాలు పీ. శివపార్వతి, కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ.. 2019 నుంచి ఇప్పటివరకు జీతాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.