MLG: మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆపడం ఘోర అన్యాయం అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన తీవ్ర విమర్శలు చేశారు. డిలిమిటేషన్ పేరుతో మహిళా బిల్లును నిలిపివేయడం ఘరానా మోసం అని ఆరోపించారు. తక్షణమే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, లేదంటే నిరసనలు తప్పవన్నారు.