RR: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కొత్తూరు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. దేశానికి సేవలందిస్తున్న ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని, ప్రజలు అలాంటి వ్యాఖ్యలను సమర్ధించరన్నారు. ఖర్గేను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.