SDPT: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ప్రధాన రోడ్డుపై భారీగా గుంతలు పడ్డాయి. గడిచిన రెండేళ్లుగా ఏలాంటి మరమ్మత్తులు చేపట్టకపోవడంతో గుంతలు రోజురోజుకీ పెద్దవిగా మారుతున్నాయి. వాహనదారులు ముఖ్యంగా ద్విచక్రవాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు రాత్రి వేళల్లో కింద పడి గాయాల పాలవుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ రోడ్డును వెంటనే అధికారులు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.