ఐస్‌లో ‘ఎడిబుల్’, ‘నాన్ ఎడిబుల్’ అని రెండు రకాలుంటాయి. పానీయాల్లో వాడేది ఎడిబుల్ ఐస్ కాగా, చేపలు, పండ్ల నిల్వకు వాడేది నాన్ ఎడిబుల్. వీటి నిల్వలో వేర్వేరు ప్రమాణాలు పాటించాలి. కానీ 80 శాతం మందికి ఈ తేడా తెలియదు. రోడ్ల పక్కన పండ్ల రసాల్లో నాన్ ఎడిబుల్ ఐస్ వాడటం వల్ల చాలామంది అనారోగ్య పాలవుతున్నారని నిపుణులు చెబుతున్నారు.