NDL: సంజామల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జనగణన రెండో బ్యాచ్ శిక్షణా ముగింపు కార్యక్రమానికి తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో సాల్మన్, సూపర్వైజర్ డా.కృష్ణకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మే ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి జనగణన కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు పాల్గొని పారదర్శకంగా వివరాలు సేకరించాలన్నారు.