KDP: సార్వత్రిక ఎన్నికలకు ముందు చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని జాతీయ చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున కోరారు. గురువారం నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.నేతన్న నేస్తం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రుణమాఫీ, నూలు సబ్సిడీలు తక్షణమే అమలు చేయాలన్నారు. చేనేతపై విధించిన జీఎస్టీని తొలగించాలన్నారు.