KNR: జనగణన – 2026-27 శిక్షణ వేళల మార్పు కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ప్రతినిధులు బుధవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎండల తీవ్రత దృష్ట్యా శిక్షణను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని కోరారు. అలాగే తొలి విడతకు హాజరుకాలేని ఉపాధ్యాయులకు మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.