TG: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేబినెట్ నిర్ణయించింది. నిందితులపై చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంలో ‘స్పెషల్ లీవ్ పిటిషన్’ (SLP) వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టు వైఫల్యాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను శిక్షించేలా చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.